ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శనివారం కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా కళ్లంబలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హోటల్ వ్యాపారి మణికంఠన్ ఉరేసుకున్నాడు. అతని కుటుంబ సభ్యులు విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.