జుట్టు రాలిపోతుందని మనస్తాపంతో కావ్యశ్రీ(21) అనే యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని మైసూర్ లో శనివారం చోటుచేసుకుంది. ఆమె కొద్దిరోజులుగా జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంది. పలు రకాల చికిత్సలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. కొన్ని రోజులకు మెల్లమెల్లగా జుట్టు చాలా వరకు ఊడిపోయింది. దీంతో కుంగుబాటుకు లోనై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయింది.