మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. భార్యతో అసహజ శృంగారానికి పాల్పడడమే కాకుండా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ కీచక భర్త. దీంతో బాధితురాలు లసుడియా పోలీసులను ఆశ్రయించింది.
రూ.కోటి రూపాయలు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్మెయిల్కు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు అత్తమామలు కూడా సహకరిస్తున్నారని వారిపై కూడా కేసు పెట్టింది.