దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఎంపికవ్వాలని చాలా మంది రాజకీయ నేతల్లో ఉంటుంది. అయితే 1977లోనే రాష్ట్రపతి పదవిని ప్రముఖ నాట్య కళాకారిణి రుక్మిణి అరండాల్ వద్దనుకున్నారు. నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ఇక రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి మహిళగా ప్రతిభాపాటిల్ నిలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలిస్తే రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండవ మహిళ అవుతారు.