తమిళనాడులోని పుదుప్పేటకు చెందిన ఇంద్రాణి కుమారుడికి పెళ్లయ్యి విడాకులయ్యాయి. అతనికి రెండో పెళ్లి కోసం సంబంధాలు చూస్తుండగా పెళ్లిల బ్రోకర్ ద్వారా తిరుపతికి చెందిన శరణ్య పరిచయమైంది. శరణ్య వారిని 30 ఏళ్ల అమ్మాయిగా నమ్మించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత ఆస్థి తనపేరు మీద రాయాలని ఒత్తిడి చేయడంతో అనుమానమొచ్చి భర్త విచారణ చేశాడు. విచారణలో ఇంద్రాణి వయస్సు 54 అని,పెళ్లయ్యి ఇద్దరు పిల్లలున్నారని తేలింది.