శరీర ఆరోగ్యానికి సమతుల ఆహారం అవసరం. కావాల్సిన పోషకాలు సరైన పాళ్లలో అందినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీనికోసం తగు మోతాదులో రకరకాల ధాన్యాలు, పప్పులు, మాంసాహారులైతే గుడ్లు, మాంసం లేదా పాలు, పాల ఉత్పత్తులు, రకరకాల కూరగాయలు, పండ్లు అన్నీ తీసుకోవాలి. అయితే కొంత మంది రాత్రిపూట అన్నానికి బదులుగా కేవలం పండ్లను తీసుకుంటే ఏమౌంతుంది అనే సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు.
అయితే ఏ పోషకాలనైనా పూర్తిగా మానేసినా లేదా అధికంగా తీసుకున్నా దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవు. అన్నం మానేయాలని భావించినప్పుడు తాని స్థానంలో ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు, గోధుమలు, తృణ ధాన్యాలను వాడవచ్చు. రాత్రిపూట మితంగా భుజించడం మంచిదే అయినప్పటికీ చక్కెరలు అధికంగా ఉండే పండ్లను అధిక మొత్తంలో రాత్రిపూట తీసుకోవడం, వాటితో పాటు ఎలాంటి ప్రొటీన్లు తీసుకోకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయిల్లో తేడాలు వస్తాయంటున్నారు నిపుణలు. ఇది ఇబ్బందులకు గురి చేసే ఛాన్సు ఉందంటున్నారు.