హిందూపురం: పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని టీడీపీ నాయకులు మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలపై మోయలేని భారాలను మోపుతున్నాడని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంపుతో సతమతమవుతున్న ప్రజలపై మళ్ళీ ఆర్టీసీ చార్జీలు మోపడం సిగ్గుచేటు అన్నారు.