జగన్ ప్రభుత్వం బడులు తెరిచిన తొలిరోజు నుంచే విద్యార్థులకు కిట్లు పంపిణీ మొదలుపెట్టింది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మందికి ఈ కిట్లు అందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తుంది. ఒక్కో కిట్ విలువ రూ.2 వేలు ఉంటుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల పిల్లలకు కిట్స్ నివ్వడం ఇది వరుసగా మూడోయేడాది