ఇప్పటికీ కరోనా, మంకీపాక్స్‌లతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా వెలుగు చూసిన 'ర్యాట్ ఫీవర్' (ఆర్‌బీఎఫ్) కేసులు గుబులు పుట్టిస్తున్నాయి. కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో 81 ర్యాట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. బాక్టీరియా సోకిన ఎలుకలు కొరికిన ఆహార పదార్ధాలు తిన్నా, ఆ ఎలుకలు కొరికినా ఈ వ్యాధి సోకుతుంది. జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలుంటాయి.