వర్షం కారణంగా ఘాట్ రోడ్డులో వాహన దారులను టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేస్తోంది. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. 10వ కిలోమీటర్ దగ్గర రోడ్డుపై కొండరాయి పడిపోయింది. రెండు రోజులుగా తిరుమలలో వర్షం కురవడంతో కొండచరియలు ఇలా పడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. అలాగే రోడ్డులో పడిపోయిన రాయిని అక్కడి నుంచి తొలగిస్తున్నారు. ఇదిలావుంటే మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం 73వేల 439మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 34,490మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.4.35కోట్లు ఆదాయం వచ్చింది. స్వామివారి దర్శనానికి 9 గంటల సమయం పడుతోంది.