పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను చంఢీగఢ్ లో గురువారం ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయన తన మొదటి భార్యకు ఆరేళ్ల క్రితం విడాకులిచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలు తమ తల్లితో కలిసి అమెరికాలో ఉంటున్నారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో భగవంత్ మాన్, గురుప్రీత్ కౌర్ ల వివాహం చంఢీగఢ్ సెక్టార్ 8లోని ఓ గురుద్వారాలో జరగనుంది.