బాలలకు సంబంధించిన జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015, బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 మరియు పొక్సో చట్టం 2012 వంటి వివిధ చట్టాలు ప్రయోగించేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి జిల్లాలోని హెడ్ కానిస్టేబుల్ మరియు ఆపై స్థాయి అధికారులకు జిల్లా స్థాయి అవగాహన సదస్సు జరిగిందని పల్నాడు జిల్లా పోలీస్ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లాల డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసెక్యూషన్ మధుసూదన్ రావు, సీనియర్ పబ్లిక్ ప్రాసెక్యూటర్లు, సీఐలు విజయ కృష్ణ, ఉమేష్, బాలకృష్ణ లు,ఎస్సైలు,ఏఎస్సైలు మరియు హెడ్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.