అనంతపురం జిల్లా, నార్పల మండలం పి.బండ్లపల్లి, గడ్డం నాగేపల్లి గ్రామాలలో ఎస్సై వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఫ్యాక్సనిస్టులు, పాత ఎక్సైజ్ కేసుల్లోని నిందితులు, అనుమానితుల ఇళ్లల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ రెండు గ్రామాలలో విజబుల్ పోలీసింగ్ , గ్రామసభలు నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లకుండా ప్రశాంతంగా జీవించాలని సూచించారు. దిశా యాప్ రోడ్డు ప్రమాదాలు, సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.