ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యాభివృద్ధికి చేపట్టిన జగనన్న విద్యాకానుక కిట్లు పాఠశాలలు ప్రారంభమైన అమరాపురం మండలంలో చేపట్టలేదు. ఇక్కడ ఎంఇఓ గా ఉన్న సత్యనారాయణ సక్రమంగా తన విధులకు హాజరుకాకపోవడం, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో ఎవరికీ తెలియని సమాచారంతో మండలంలో విద్యావ్యవస్థ రోజురోజుకు అధ్వానంగా తయారవుతుందని విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విధులకు డుమ్ముకొడుతున్న ఎంఇఓ పై కఠినచర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరారు.