టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కనుసన్నల్లోనే పటాన్ చెరులో కోడి పందేలు జరుగుతున్నాయని మీడియాలో వరుస కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై గురువారం సోషల్ మీడియా వేదికగా చింతమనేని స్పందించారు. కోడి పందేల్లో లేని వ్యక్తిని అక్కడ ఉన్నట్టు చూపించి నీచమైన ప్రచారాలు చేశారని మండిపడ్డారు. ఇలాంటి రాక్షస రాజకీయాలను తానెక్కడా చూడలేదని, దీనికి ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు.