కాకినాడ లోని గైగోలపాడుకు చెందిన అచ్చియ్యమ్మ తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు వినతిపత్రం ఇచ్చింది. ఇటీవల తన చిన్న కొడుకు, కోడలు అచ్చియ్యమ్మను ఇంట్లో నుండి గెంటేసి గేటుకు తాళం వేశారు. అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని మనస్ధాపం చెందిన అచ్చియ్యమ్మ ఇష్టపూర్వక మరణం కోసం అర్జీ పెట్టుకుంది. కొడుకు, కోడలు ప్రవర్తనపై విసుగు చెందానని, ఇక బతకాలని లేదని ఆమె తెలిపింది.