పల్నాడు జిల్లాలో తొలకరి పలకరించడo తో రైతన్నలు ఉత్సాహంగా నాగలి పట్టి పొలం బాట పట్టారు. జిల్లాలోని పలు మండలాల్లో గత మూడు రోజులుగా సంతృప్తి కరమైన వర్షాలు కురిసి భూమి పదునెక్కడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు.
జిల్లాలో రైతులు అధికంగా పత్తి, మిరప, కంది, మెట్ట పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. కాల్వ, నీరు, బోరు అందుబాటులో ఉన్న ప్రదేశాలలో మాగాణి పంటలు వేసేందుకు రైతన్నలు సమాయాత్త మౌతునారు.