గుత్తి పట్టణంలోని ప్రైమరీ పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం విలీనం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి. రమేష్ డిమాండ్ చేశారు.
గురువారం మున్సిపా లిటీ పరిధిలోని ఆర్ఎస్ లో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఎస్ఎఫ్ ఐ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లా డుతూ పాఠశాలల విలీనం ప్రక్రియను ఉపసంహరించుకోని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు.