కర్ణాటకలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోగా, కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోవడంతోపాటు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో కర్ణాటక తీర ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు ఉత్తర కన్నడ, కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.