దుబాయ్ మహజూజ్ డ్రాలో ఓ భారతీయుడిని అదృష్టం వరించింది. ఏకంగా 10 మిలియన్ దిర్హమ్స్ (రూ.21 కోట్లు) లాటరీ దక్కింది. జులై 2న శనివారం తీసిన డ్రాలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనీష్ పేరు వచ్చింది. సంబంధిత చెక్కును తాజాగా మహజూజ్ కార్యాలయంలో అనీష్‌కు అందజేశారు. తాను ఏడాదిగా ఈ 'లక్కీ డ్రా' పాల్గొంటున్నానని, ఇప్పటికి నిరీక్షణ ఫలించిందని అనీష్ చెప్పాడు.