ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తంచేసింది. ఇప్పటివరకు 59 దేశాలకు వ్యాపించిన వైరస్.. 6,027 మందిలో నిర్ధారణ అయ్యింది. వారంలోనే మంకీపాక్స్ కేసుల్లో 66 శాతం పెరుగుదల కనిపించిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ వ్యాధి కారణంగా తాజాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య మూడుకు చేరింది. యూరప్, ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa