రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించారు. ఇదేంటని నిలదీసిన దళిత యువకులపై దారుణమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే చెల్లింది అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ తెలియజేసారు. వివరాల్లోకి వెళ్ళితే... రావులపాలెం మండలం గోపాలపురంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అంబేద్కర్ ఫోటోలున్న పేపర్ ప్లేట్లలో ఆహారపదార్థాలు అందిస్తూ, బాబాసాహెబ్ ఫోటోలని ఎంగిలి డబ్బాలలో వేస్తున్నారు. ఇదేంటని నిలదీసిన 19 మంది దళిత యువకులపై 120బీ సెక్షన్ కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి జైలులో బంధించడం జరిగింది. దీనిపై నారా లోకేష్ స్పందిస్తూ... రాష్ట్రంలో దళితులపై సాగుతున్న దమనకాండకి నిదర్శనం. అణగారినవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్‌ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, అవమానంపై నిలదీసిన యువతని అరెస్టు చేయడం దారుణం. దళితులపై దమనకాండ సాగిస్తూ, కుల,మత,ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ జగన్ రెడ్డి గారు వికృతానందం పొందుతున్నారు. దళిత యువత భవితని నాశనం చేసే ఇటువంటి అక్రమ అరెస్టులని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బేషరతుగా యువకులపై కేసులు ఎత్తేసి, వారిని జైలు నుంచి విడుదల చేయాలి. అంబేద్కర్ గారిని అవమానించిన వారిని శిక్షించాలి అని డిమాండ్ చేసారు.