అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో నిందితుడైన పోలీస్‌కు 21 ఏళ్ల జైలు శిక్ష పడింది. నిందితుడు డెరెక్ చౌవిన్‌పై అభియోగాలు రుజువు కావడంతో కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి పాల్ మాగ్నూసన్ జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 మే 25న మిన్నియాపోలిస్ కార్నర్ స్టోర్ వద్ద ఫ్లాయిడ్‌ను డెరెక్ మోకాలితో నేలపై తొక్కి పెట్టాడు. ఊపిరి ఆడక ఫ్లాయిడ్ చనిపోయాడు.