కరోనా వైరస్ కొత్త వేరియంట్ భారత్‌లో బయటపడిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్‌కు సబ్ వేరియంట్‌గా బీఏ.2.75ను గుర్తించినట్లు తెలిపింది. దీనిని మొదట భారత్‌లో గుర్తించామని, తర్వాత మరో 10 దేశాల్లో బయటపడిందని పేర్కొంది. దీనివల్ల ఆయా దేశాల్లో ప్రమాదం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గతవారం రోజుల్లో కరోనా కేసులు సంఖ్య 30 శాతం పెరగటం ఆందోళన కలిగిస్తోంది.