ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైనిటాల్ జిల్లా రామ్‌నగర్ ప్రాంతంలో ఓ కారు నదిలో కొట్టుకుపోయింది. దీంతో 9 మంది మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున రామ్‌నగర్ వద్ద ధేలా నది వరద నీటి ప్రవాహంలో ఎర్టిగా కారు కొట్టుకుపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మరణించారు. ఓ బాలిక సహా ఇద్దరిని పోలీసులు రక్షించారు. ప్రమాద సమయంలో కారులో 11 మంది ఉన్నారని చెప్పారు. మృతులంతా పంజాబ్‌కు చెందిన వారేనని వెల్లడించారు. ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.