దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి, మృతదేహాన్ని అతని కుటుంబానికి స్వయంగా డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులు... "మావాడు చంపితే చంపాడు. అంతమాత్రాన కేసు పెడతారా?" అన్నట్టు ఎదురు బెదిరింపులకు దిగారు. ఈ మేరకు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ...తమను కులం పేరుతో దూషిస్తూ... "మాల ముండల్లారా! మీ వల్లే మా అబ్బాయి జైలుకెళ్లాడు. వాడు రాగానే మీ అంతు చూస్తాం" అని అనంతబాబు కుటుంబసభ్యులు బెదిరించినట్టుగా పేర్కొన్నట్లు టీడీపీ నాయకులు తెలియజేసారు.