భూమిపై ఒకే సమయంలో సగం భాగం పగలు, సగభాగం చీకటి ఉంటుందని మనకు తెలిసిందే. కానీ ఒకేసారి దాదాపు మొత్తం భూ భాగంపై వెలుతురు ఉండే విషయం గూర్చి, అది కూడా నేడే అని మీరెప్పుడైనా విన్నారా. అవును, జూలై 8న ఉదయం 11.15(యూటీసీ) (భారత్‌లో సాయంత్రం 4.45 గంటలకు) గంటలకు భూగోళంపై ఉన్న జనాభాలో 99 శాతం మందిపై ఒకేసారి సూర్యకాంతి పడనున్నది. ఇది అత్యంత అరుదుగా జరిగే ఖగోళ అద్భుతం.