ఏపీలోని కోనసీమ జిల్లా కొమరగిరిపట్నంలో ఈ నెల 2న మంగాదేవి, జ్యోతి అనే తల్లీకూతురు సజీవదహనమయ్యారు. అయితే వారిని నాగలక్ష్మి అనే మహిళ హత్యచేయించినట్లు పోలీసులు తేల్చారు. జ్యోతి భర్తకు పెళ్లికి ముందు నాగలక్ష్మితో ఎఫైర్ ఉంది. పెళ్లైన తర్వాత అతను ఆమెను దూరం పెట్టాడు. దీంతో నాగలక్ష్మి జ్యోతిని చంపాలనుకుంది. తన సవతి కూతుళ్లు సౌజన్య, దివ్య హరితలతో వారిపై పెట్రోలు పోసి తగలబెట్టించింది.