యూపీలోని గురుగ్రామ్ లో ఓ వ్యక్తి తన భార్యను వేరే మగాళ్లతో గడపాలని వేధించాడు. ఢిల్లీలో జరిగే భార్యలను మార్చుకునే పార్టీలకు రావాలన్నాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమెను కొందరు స్థానిక గుండాలు చంపుతామని బెదిరించారు. దీంతో ఆమె గురుగ్రామ్ లో కోర్టుకు వెళ్లి తన బాధను చెప్పుకుంది. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.