వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు భార్యను చంపాడో భర్త. పిల్లలు చూస్తుండగానే జరిగిన ఈ ఘోర ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది. తన భర్త రవి మరొక యువతితో సన్నిహితంగా ఉన్నట్లు గ్రహించిన భార్య యోగితా ప్రశ్నించడమే ఆమె చేసిన నేరమైంది.
దంపతుల మధ్య జరిగిన గొడవలో భర్త తన భార్య గొంతు నులిమి హతమార్చాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.