నాదెండ్ల: నాగార్జున యూనివర్సిటీ వద్ద నేడు రెండవ రోజు వైయస్సార్సీపీ సమావేశ ప్లీనరీ కార్యక్రమానికి నాదెండ్ల మండలం నుండి కార్యకర్తలు నాయకులు హాజరు కావడానికి 40 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు మండల కన్వీనర్ గొంట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 15 గ్రామపంచాయతీ పరిధిలోని ఐదు సీవారు గ్రామాలతో కలిపి బస్సులు ఏర్పాటు చేశామని, నాయకులు కార్యకర్తలు ప్లీనరీ సమావేశానికి తప్పక పాల్గొనాలని కోరారు.