ప్రతి రోజూ పేదల సంక్షేమం కోసమే ఈ పనిచేసే సీఎం వైయస్ జగన్ అని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని అన్నారు. ప్లీనరీలో ఆమె మాట్లాడుతూ సీఎం వైస్ జగన్ పాలన సంక్షేమం, ప్రజాహితం కోసమేనని ఆమె స్పష్టం చేశారు.
కోట్లాది మందికి ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తున్న ఏకైక సీఎం వైయస్. జగనేనని అన్నారు. వైద్యరంగంలో సీఎం గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని, ఆరోగ్యశ్రీ తో పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారని తెలిపారు.