పెనుగంచిప్రోలు: గ్రామంలోని తిరుపతమ్మ వారి ఆలయ అభివృద్ధిపై జగ్గయ్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను విజయవాడలో దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్లో చర్చించారు. ఈ సందర్భం గా ఆలయం వద్ద నూతన కేశఖండన శాల, డార్మెటరీ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని, త్వరలో అనుమతి ఉత్తర్వులు వస్తాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్ర మంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ ఇంజం చెన్నకేశవరావు, ఈఈ వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.