విజయనగరం జిల్లా, ఎస్పీ M. దీపికా , IPS, ఆదేశాలతో పేకాట స్థావరాలపై పోలీస్ వారు జిల్లా వ్యాప్తంగా రైడ్ నిర్వహించారు. ఇందులో భాగంగా వంగార మండలం నీలయ్యపేట గ్రామంలో జూలై 8న పేకాట ఆడుతున్న వారిపై వంగార ఎస్ఐ మరియు సిబ్బంది రైడ్ చేసి, 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేసారు. వారి వద్ద నుండి రూ. 81,200/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎక్కడ పేకాట ఆడిన తగిన శిక్షలకి పాల్పడుతారని ఈ సందర్భంగా హెచ్చరించారు. అవినీతికి, గ్యాంబ్లింగ్ కి దూరం ఉంటూ జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రజలకి కూడా ఉంది కాబట్టి సమాజంలో ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడకుండా జీవించాలని హెచ్చరించారు.