వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి, విషాదాన్ని కూడా దిగమింగి తన భర్త మరణాంతరం అనేక అవమానాలను ఎదురొడ్డి.. తన కుమారుడిని ఇంతటి గొప్ప ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దేందుకు వైయస్ విజయమ్మ నిర్వర్తించిన భూమిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు.. భారతదేశంలో వైయస్ విజయమ్మ పాత్ర మరువలేనిది’’ అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్ రాజకీయ సభలకు హాజరయ్యారని రాసిన ఈనాడు రామోజీరావుకు.. గత మహానాడుకు కోడెల శివప్రసాద్ హాజరై మాట్లాడిన మాటలు వినపడలేదా.. కనబడలేదా..? అని ప్రశ్నించారు. తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడైన తరువాతే ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యానని చెప్పారు. ప్లీనరీ రెండోరోజు సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు.