జమ్మూకశ్మీరర్లోని అమర్నాథ్లో కుండపోత వర్షం కురుస్తోంది. వరదల ధాటికి అమర్నాథ్ యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. 16 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 40 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి.
మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఐటీబీపీ అధికారులు చెబుతున్నారు. వరదల దృష్ట్యా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.