కారుచౌకకు రైతుల నుంచి భూములు లాక్కొని పేద రైతులను రోడ్డునపడేసిన నీచుడు చంద్రబాబు అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే రాజధాని నూజివీడు అని ప్రకటించి తన బినామీలతో అమరావతి ప్రాంతంలో వందల ఎకరాల భూములను చౌకధరలకు కొనుగోలు చేయించిన తరువాత అమరావతిని ప్రకటించాడని, అసైన్డ్ భూములను కూడా బెదిరించి, భయపెట్టి పేద రైతుల నుంచి లాక్కున్నారన్నారు. సంవత్సరానికి మూడు పంటలు పండే భూములు ఇవ్వలేం, సారవంతమైన భూములు కావాలని రైతులంతా రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్న సందర్భంలో చంద్రబాబు కుయుక్త రాజకీయాలు, కుట్రలు పన్ని రైతులపై కేసులు పెట్టాలనే వ్యూహంతో భూములు తగలబెట్టించాడు. హాయిల్యాండ్ ప్రాంతంలో తన మినిస్టర్లతో రైతుల పంటలను తగలబెట్టించి భయబ్రాంతులకు గురిచేశాడు. అక్కడి నుంచి మొదలైన రాజధాని రణరంగం.. ఇష్టానుసారంగా పరిపాలించాడు. వ్యతిరేకించిన వారందరిపై కేసులు పెట్టించాడు అని ఆగ్రహం వ్యక్తపరిచారు.