దేశంలో రాజ్యాంగాన్ని రబ్బరుస్టాంపు రాష్ట్రపతి కాపాడలేరని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శుక్రవారం అన్నారు. గుజరాత్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కోరేందుకు సిన్హా అక్కడకు వెళ్లారు.
తనకు, ఎన్టీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు పోటీ కేవలం రాష్ట్రపతి అంశం మాత్రమే కాదన్నారు. దేశంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని, పత్రికలు, రాజ్యాంగ విలువలకు ముప్పు ఏర్పడిందని అన్నారు.