కొబ్బరి పువ్వులో చాలా పోషకాలు ఉంటాయి. దీనిని ఎక్కువగా చెన్నైలో విక్రయిస్తుంటారు. ఒక్కో పువ్వు ధర రూ.50 నుంచి 100 వరకు ఉంటుంది. కొబ్బరి పువ్వు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నీరసం, అలసట వంటి సమస్యలను దూరం చేస్తుంది. కిడ్నీ సమస్యల నుంచి కూడా కాపాడుతుంది. క్యాన్సర్ వంటి సమస్యలు దరి చేరకుండా నివారించగలుగుతుంది. అంతేకాదు.. చర్మ సమస్యలు కూడా దరి చేరకుండా చేసి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.