ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచింది. మార్జిల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10 నుంచి అన్ని రకాల రుణాలపై ఇది అమల్లోకి రానుంది. దీంతో బ్యాంకు వడ్డీరేట్లు 6.95 శాతం నుంచి 7.55 శాతానికి మధ్య చేరాయి. వెహికల్, పర్సనల్, హోం లోన్ వడ్డీ రేట్లు 7.45 శాతం నుంచి 7.55 శాతానికి పెరిగింది.