రైతు సమస్యలు అక్రమ మైనింగ్ పై ఈ రోజు టిడిపి ఆధ్వర్యంలో చేపట్టబోయే “చలో గొందిరెడ్డిపల్లి” కార్యక్రమాన్ని ముందస్తుగా అడ్డంకులు సృష్టించడానికి పోలీసులను ఉపయోగించుకుంటూ నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదు అని టీడీపీ నాయకులూ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము పోరాటం చేస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. వైసిపి నేతల ప్రోత్బలంతో మమ్మల్ని అడ్డుకోవడం పోలీసులకు ఎంతవరకు సమంజసం? పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన జరగబోయే కార్యక్రమానికి కచ్చితంగా వెళ్లి తీరతాం అని ధీమా వ్యక్తపరిచారు.