బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కొర్బెవ్యాక్స్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాలను 12 ఏళ్లలోపు పిల్లలకు వేసేందుకు ఎన్టాగికి చెందిన స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కొర్బెవ్యాక్స్‌ను 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు, కొవాగ్జిన్‌ను 6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు వేయొచ్చని ప్రతిపాదించింది. ఏప్రిల్ 26న కొవాగ్జిన్‌కు, అదే నెలలో కొర్బెవ్యాక్స్‌కు డీసీజీఐ అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి.