విద్యార్థులకు సామాజిక బాధ్యతతో మంచి లక్షణాలు అలవాటు చేయాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక IPS ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన CAMPUSCOPS ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ IAS ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు సమయపాలన, స్కిల్ డెవలప్మెంట్, నాయకత్వలక్షణాలు ఉన్నప్పుడు ఉన్నతమైన పౌరులుగా గుర్తింపు పొందుతారని పేర్కొన్నారు. క్యాంపస్ కాప్స్ పోలీసింగ్ లో 5 రోజులు శిక్షణ పొందిన వారు జిల్లా పోలీసు యత్రాంగానికి ఒక అంబాసిడర్ గా ఉపయోగపడతారన్నారు. ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలనేదే ఈ క్యాంపస్ కాప్స్ విధానం లక్ష్యం అన్నారు. ప్రతి విద్యార్థి జాతి నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించాలని, నేర రహిత సమాజ స్థాపనలో పోలీసువారికి సహాయపడాలని హితవుపలికారు. మిమ్మల్ని చూసి మరికొందరు నేను క్యాంపస్ కాప్స్ అయితే బాగుంటుందని ముందుకు వచ్చేలా మీరు ప్రవర్తించాలని కోరారు. అనంతరం ఎస్పీ కార్యక్రమానికి హాజరైన అతిధులకు దుశ్శాలువతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.