ముడి సరకుల ధరలు పెరగడంతో మిగిలిన ఆటో మొబైల్ కంపెనీలు గత రెండు మాసాలుగా వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టాటా మోటార్స్ కూడా అదే బాటలో వాహనాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వేరియంట్, మోడల్ ఆధారంగా మునుపటి ధరలో సగటున 0.55 శాతం పెంచినట్లు ప్రకటించింది. టాటా తమ వాణిజ్య వాహనాల ధరలను జులై నెల నుండి 1.5 – 2.5 శాతం వరకు పెంచింది.