జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నవరత్నాలపై శుక్రవారం కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రశ్నలకు సిఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని జనసేన నేత కొణిదెల నాగబాబు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న తీరును పార్టీ నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్తూ శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాలకు జనసేన వ్యతిరేకం కాదని చెప్పారు.