జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా. ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము పోటీ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ద్రౌపది ముర్ము వివిధ రాష్ట్రాల నేతల మద్దతు పొందేందుకు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఏపీకి ద్రౌపది ముర్ము ఎల్లుండి రాబోతోంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ నివాసానికి రానున్నారు. సీఎం జగన్ నివాసంలో ద్రౌపది ముర్ముకి టీ పార్టీ ఏర్పాటు చేయనున్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ ఇప్పటికే మద్దతు ఇచ్చింది.