ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20వ అంతర్జాతీయ జావా,ఎస్డి డే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 10, 2022, 08:57 PM

 జులై రెండో ఆదివారం అంతర్జాతీయ జావా మరియు ఎస్డి దినోత్సవం సందర్భంగా.. ప్రతి ఏట ఆంధ్ర జావా , ఎస్డి మోటార్ సైకిల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే జావా   రైడ్ , ఈ ఏట విజయవాడ లో హెల్మెట్ రైడ్ గా వ్యాస్ కాంప్లెక్స్ నుండి ప్రారంభించారు.. ఈ రైడ్ లో పలు ప్రాంతాల నుండి జావా,ఎస్డి  రైడర్స్ పాల్గొన్నారు..

1960 లో జగస్లోవియా లో తయారుచేయబడ్డ ఈ మోటర్ సైకిల్ 1970 - 80 మధ్య భారతదేశంలో అరుదుగా దర్శనమిచ్చేవి.. అప్పట్లో ఒక ఎకరా పొలం కంటే ఈ మోటార్ వాహనమే ఎక్కువ ఖరీదు ఉండేది. ఈ వాహనాన్ని కలిగి ఉండటం అప్పట్లో ఒక స్టేటస్ గా చెప్పుకునేవారు.. ఎంత ఎత్తైన గుట్టలు, పర్వతాలు పైకి కూడా సులువుగా ఎక్కగలిగిన సామర్థ్యత ఉన్న ఈ వాహనాలు..

ఎంతో ప్రతిష్టాత్మకంగా సంపన్నులచే  ఉపయోగించ పడ్డాయి. ఈ వాహనాలు కాలక్రమీనా మరుగున పడటంతో, ఇప్పుడు మహేంద్ర మోటార్స్ వారు వీటికి ఆధునికతను జోడించి మళ్లీ మార్కెట్లోకి దించారు..

అయినప్పటికీ  పురాతన వాహనాలకు  ఏమాత్రం గిరాకీ తగ్గలేదు. ఈ నైపద్యంలో భారతదేశంలో ఉన్న జావా ప్రేమికులు అందరూ లక్షలు వెచ్చించి పురాతన వివాహనాలు సొంతం చేసుకుంటున్నారు..

ఈ వాహనాలు కలిగి ఉన్నవారు అందరూ కొన్ని గ్రూపులుగా చేరి, ఏటా ఇటువంటి రైడ్  నిర్వహిస్తూ ఉంటారు..

ఈరోజు విజయవాడలో నిర్వహించిన హెల్మెట్ రైడ్ వ్యాస్ కాంప్లెక్స్ నుండి ప్రారంభించి ఇబ్రహీంపట్నం సంగమం వరకు కొనసాగింది..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పూరేంద్ర గారు జండా ఊపి ప్రారంభించారు.. 


                        ఇట్లు,
AJYMC సభ్యులు.
బొప్పూరి శ్రీరామ్, కే రామచంద్రరాజు ,ఎం శ్రీనివాస్, డాక్టర్ ముఖర్జీ ,ఎం చక్రవర్తి ,జి బాబు ,డాక్టర్ రామకృష్ణ , మెకానిక్ కిషోర్  తదితరులు పాల్గొన్నారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com