పటిష్ట బయోబబుల్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నా ఆటగాళ్లకు కరోనా సోకుతోంది. తాజాగా ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై టెస్టు ఆడుతున్న శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిసాంకకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆదివారం తనకు ఒంట్లో బాగోలేదని చెప్పడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేశారు. అందులో పాజిటివ్‌గా తేలడంతో జట్టులో కలవరం మొదలైంది. అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా ఒషాడో ఫెర్నాండో జట్టులోకి వచ్చాడు.