గుజరాత్‌కు చెందిన స్వలింగ సంపర్కుడైన యువరాజు మన్వేంద్ర సింగ్ గోహిల్ ఈ నెల 6న ఒహియోలోని కొలంబస్ చర్చిలో మరో స్వలింగ సంపర్కుడిని పెళ్లి చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం తమ పెళ్లి ఫొటోలు, వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈయన 2006లో తనను తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. 2018లో ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్వలింగ సంపర్కుల ఆశ్రమాన్ని ఆయన ఏర్పాటు చేశారు.