టీడీపీ నాయకులూ , పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, జగన్ అరాచక, అక్రమాలు, అవినీతి బయటపెడుతున్నారనే కక్షతోనే ఆయన భద్రత ఉపసంహరించుకున్నారు జగన్రెడ్డి అని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. పోలీసుల్ని అడ్డు పెట్టుకుని ఎన్నాళ్లీ వేధింపులు? నీ పాదయాత్ర, ఓదార్పుయాత్రలకి ఇలాగే భద్రత తీసేస్తే, ఏ యాత్ర చేసేవాడివి? అని ప్రశ్నించారు. అలానే ఈ విషయం మీద స్పందించిన టీడీపీ నాయకులూ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. పీఏసీ చైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ భద్రతా సిబ్బందిని తొలగించడం అంటే..ఆయన ప్రాణాలకు హానితలపెట్టడానికి జగన్రెడ్డి కుట్ర చేస్తున్నారని స్పష్టం అవుతోంది. వెంటనే భద్రత పునరుద్ధించాలి అని డిమాండ్ చేసారు. ఇది ఇలా ఉండగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారికి భద్రతలో భాగంగా 1+1 గన్ మేన్లను కొనసాగిస్తున్నాం. గన్ మేన్లను ఉపసంహరిస్తూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఆయనకు ప్రస్తుతమున్న భద్రతను అలానే కొనసాగిస్తాం అని అనంతపురం పోలీస్ శాఖ తెలియజేసారు.